ట్రెడ్ మిల్ పై ఇలా డ్యాన్స్ చేయొచ్చా... ఇంటర్నెట్ ను ఊపేస్తున్న వీడియో!
- 10 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకున్న వీడియో
- ట్రెడ్ మిల్ పై కిల్లర్ మూమెంట్స్ చేసిన యువతి
- 'మేరా పంజాబ్' ఫేస్ బుక్ ఖాతాలో వీడియో
మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ వీడియోను చూసిన వారంతా, ఆ యువతి చేసిన కిల్లర్ మూమెంట్స్ కు 'వావ్' అనకుండా ఉండలేకపోతున్నారు. 'మేరా పంజాబ్' ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ యువతి ట్రెడ్ మిల్ పై డ్యాన్స్ చేసేలా పూర్తి శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. ఇటువంటి ప్రయోగాలు సాధారణ ప్రజలు చేస్తే ప్రమాదకరం. ట్రెడ్ మిల్ పై యువతి విన్యాసాల వీడియోను మీరూ చూడవచ్చు.