అత్తారింటికి వచ్చిన నవ వధువు రాత్రివేళ అదృశ్యం
- కడప జిల్లా రాజంపేట సమీపంలో ఘటన
- ఇంటి బయట అటూ, ఇటూ తిరుగుతూ అదృశ్యం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
అదే రోజు సాయంత్రం భర్తతో కలసి వధువు తన అత్తారింటికి వచ్చింది. రాత్రి పూట ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న సునీత, ఒక్కసారిగా అదృశ్యమైంది. సునీత కనిపించకపోవడంతో కంగారుపడ్డ కుటుంబీకులు, చుట్టు పక్కల ఇళ్లలో వెతికి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులుతెలిపారు.