ramana dikshitulu: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. రమణదీక్షితులను క్షమాపణలు కోరుతున్నా: ఏపీ మంత్రి సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో సోమిరెడ్డి స్పందించారు. రమణదీక్షితులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొరపాటున విజయ సాయిరెడ్డిని అనాల్సిన మాటలు రమణదీక్షితులిని అన్నానని అన్నారు. సీఎం ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు ఆగ్రహం తెప్పించాయని, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని తానని అన్నారు. తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిని మరో రాష్ట్రంలో అయితే లోపల వేసేవాళ్లని అన్నారు.
Go Back to Shorts
ramana dikshitulu
somi reddy

More Telugu News