ఆగట్టునుంటావా?... విద్యార్థి, ఈగట్టు కొస్తావా?: ఆకర్షిస్తున్న ప్రభుత్వ పాఠశాల పోస్టర్!
- క్రమశిక్షణ, నైతికి విలువలకు ప్రభుత్వ పాఠశాలలే మార్గం
- 'రంగస్థలం' సాంగ్ ను ప్రస్తావిస్తూ పోస్టర్
- ఆకర్షిస్తున్న కాజలూరు ఎంపీపీపీ స్కూల్ ప్లెక్సీ
ప్రైవేటు స్కూళ్లలో స్కూల్ ఫీజు 5 వేలు, స్కూల్ బ్యాగ్ 500, టెక్ట్స్ బుక్స్ 1000, నోట్ బుక్స్ 500, లంచ్ బాక్స్ 5 వేలు, యూనిఫాం 1000, బస్సు లేదా ఆటోకు 2 వేలు, ఇతర ఖర్చులు 5 వేలు ఉంటాయని చెబుతూ, స్కూల్ ఫీజు, బ్యాగ్, బుక్స్, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, కంప్యూటర్ విద్య తదితరాలన్నీ తాము ఉచితంగా ఇస్తామని ప్రభుత్వ పాఠశాల ఈ ప్లెక్సీలో రాసింది. ఆ ప్లెక్సీని మీరూ చూడవచ్చు.