gold: వరుసగా నాలుగు రోజుల పెరుగుదలకు బ్రేక్‌.. తగ్గిన బంగారం ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో నాలుగు రోజులుగా పై పైకి ఎగుస్తూ వచ్చిన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా రూ.105 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.32,370గా నమోదైంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో పసిడి ధర పరుగులకు బ్రేక్‌ పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ రోజు వెండి ధర కూడా నేల చూపులు చూసింది. కిలో వెండి ధర రూ.350 తగ్గి, రూ. 41,200కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధరలు తగ్గాయి. కాగా, గ్లోబల్‌ మార్కెట్లో పసిడి ధర 0.22 శాతం తగ్గి ఔన్సు పసిడి 1,301.20 డాలర్లుగా నమోదయింది.                    
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News