ఏఎన్నార్ గారు నన్ను సిఫార్స్ చేసేవారు: సీనియర్ నటుడు సంపత్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఎన్నార్ గారు నన్ను సిఫార్స్ చేసేవారు: సీనియర్ నటుడు సంపత్ రాజు

  • అక్కినేని ఫ్రెండ్ గా నటించాను 
  • ఆయన అభిమానంతో చూసుకునేవారు
  • ఆత్మీయంగా పలకరించేవారు  
అటు తెలుగు తెరపైనా .. ఇటు బుల్లితెరపైన సంపత్ రాజు విభిన్నమైన పాత్రలను చేస్తూ మెప్పించారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. "అప్పట్లో చిత్ర పరిశ్రమ చెన్నైలో వుంటే, ఉద్యోగం కారణంగా నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో కొమ్మినేని శేషగిరిరావు .. 'కొంటె కోడళ్లు' అనే సినిమాను మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

అల్లుడు పాత్ర కోసం ఒక మంచి ఆర్టిస్ట్ అవసరం కావడంతో, లోకల్ ఆర్టిస్ట్ అయిన నన్ను పిలిపించారు. నా నటన చూసి శేషగిరిరావుగారు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్రెండ్ గా ఐదారు సినిమాల్లో చేశాను. దర్శక నిర్మాతలకు నన్ను గుర్తు చేసి మరీ అలాంటి పాత్రలు నాకు వచ్చేలా నాగేశ్వరరావు గారు చేసేవారు. అలా అని చెప్పేసి నేను ఎక్కువ చనువు తీసుకునేవాడిని కాదు. పద్ధతిగా కాస్త దూరంగానే ఉండేవాడిని .. ఆయన పిలిస్తే వెళ్లి మాట్లాడేవాడిని .. నాకు తెలిసి ఆయన గొప్ప జ్ఞాని" అని చెప్పుకొచ్చారు.   
akkineni
sampath raju

More Telugu News