చిన్నారి అక్షరను నీటిగుంటలో పడేసింది ఓ బాలిక!
- చిన్నారితో కలిసి ఆడుకున్న బాలిక పుష్ప
- ఆడుకునే సమయంలో పుష్ప చేయి కొరికిన అక్షర
- కోపంతో అక్షరను నీటి కుంటలో పడేసిన బాలిక
తన చేయి కొరికిందనే కోపంతో చిన్నారిని నీటికుంటలో పుష్ప పడేసినట్టు పోలీసులు చెప్పారు. పదహారు నెలల పసిపాప అక్షర మురుగు నీటిని మింగి మృతి చెందినట్టు పోస్టుమార్టంలో తేలినట్టు చెప్పారు. పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు. కాగా, నిన్న మధ్యాహ్నం తమ కూతురు అక్షర అపహరణకు గురైందంటూ ఆమె తల్లిదండ్రులు రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.