Chandrababu: చంద్రబాబు చాలా అమాయకుడు.. అందరినీ నమ్మేస్తారు: విష్ణుకుమార్ రాజు

  • టీడీపీ నేతలే ఆ పార్టీని వదిలి వెళ్లిపోతారు
  • పార్టీలోనే ఉంటామని టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించాలి
  • మార్వాడీలకు కళా వెంకట్రావు క్షమాపణలు చెప్పాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అమాయకుడని... అందరినీ గుడ్డిగా నమ్మేస్తారని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, వైసీపీలు కలసిపోతాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొంతమంది టీడీపీ నేతలే ఆ పార్టీని వదిలి వెళ్లిపోతారని చెప్పారు. అందుకే టీడీపీలో ఉంటామని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. మార్వాడీలపై కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు దారుణమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మార్వాడీలకు కళా వెంకట్రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Chandrababu
vishnu kumar raju
YSRCP
bjp
Telugudesam

More Telugu News