samantha: ఎలా ఉండాలో నాకు తెలుసు.. నాకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు: సమంత

  • నేనెవరికీ భయపడను
  • ఎటువంటి సమస్యలోనూ చిక్కుకోవాలని కోరుకోవడం లేదు
  • నాగచైతన్యతో ఒక్కోసారి గొడవ పడతాను
  • మా గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవు
దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. గతంలో ఆమె బీచ్‌లో గడుపుతూ పోస్ట్‌ చేసిన ఓ హాట్‌ ఫొటోపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత ఆ విషయంపై స్పందించి, బీచ్‌లో అటువంటి దుస్తుల్లో ఫొటోలను విడుదల చేస్తే విమర్శలు వస్తాయని తనకు తెలుసని వ్యాఖ్యానించింది.

అయితే, బీచ్‌లో చీరలు ధరించగలమా? అని సమంత ప్రశ్నించింది. తనకు వివాహమైందని, అటువంటి పనులు చేయకూడదని కొందరు విమర్శిస్తున్నారని, తన జీవితాన్ని ఎలా గడపాలన్నది, తాను ఎలా వుండాలన్నది తనకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది. తానెవరికీ భయపడనని, అలాగే ఎటువంటి సమస్యలోనూ చిక్కుకోవాలని కోరుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

తాను తన భర్త నాగచైతన్యతో ఒక్కోసారి గొడవ పడతానని, తమ గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవని తెలిపింది. నిశ్శబ్దంగా గొడవ పడుతుండడాన్ని ఎవరైనా చూస్తే ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నామని అనుకుంటారని నవ్వుతూ చెప్పింది.
samantha
Tollywood
naga chaitanya

More Telugu News