బ్రేకింగ్... కెనడాలోని భారతీయ రెస్టారెంట్ లో భారీ పేలుడు!
- పీల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో పేలుడు
- వెంటనే పారిపోయిన అనుమానితులు
- కనీసం 15 మందికి తీవ్ర గాయాలు
ఈ ఘటన జరిగిన వెంటనే ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారని, సుమారు ఆరడుగుల ఎత్తున్న 20 ఏళ్ల యువకుడిని అనుమానిస్తున్నామని, డార్క్ బ్లూ జీన్స్ వేసుకున్నాడని తెలిపారు. మరో వ్యక్తి సుమారు 5.9 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ఫేడెడ్ బ్లూ జీన్స్ వేసుకున్నాడని, తలకు హుడీని తగిలించుకున్నాడని, ముఖాన్ని కప్పుకున్నాడని తెలిపారు. తమ ముఖం కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. వారి చిత్రాన్ని విడుదల చేస్తూ, వారి ఆచూకీ తెలిపితే తమకు వివరాలు అందించాలని కోరారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని టొరంటోలోని ట్రామా కేర్ సెంటర్ కు తరలించినట్టు వెల్లడించారు.