Pranitha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కన్నడ బ్యూటీ 
  • ఆఫీసర్ ప్రీ రిలీజ్ వేడుక వివరాలు 
  • వెంకీ, చైతూ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం

 *  రామ్ హీరోగా నటిస్తున్న 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలో బెంగళూరు ముద్దుగుమ్మ ప్రణీత ఓ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, సరికొత్తగా కనిపిస్తానని ప్రణీత చెప్పింది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో నాయికగా నటిస్తోంది.
*  అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత రూపొందిన 'ఆఫీసర్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 28 సాయంకాలం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్నారు. చిత్రాన్ని జూన్ ఒకటిన విడుదల చేస్తున్నారు.
*  వెంకటేశ్, నాగ చైతన్య కలసి నటించే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. బాబి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో వెంకీ, చైతూలు మేనమామ, మేనల్లుడు పాత్రల్లో నటిస్తారు. త్వరలోనే ఇది సెట్స్ కి వెళుతుంది. 

More Telugu News