టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు!
Add ap7am to your home Screen

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు!

  • ఉప విద్యుత్ కేంద్రం భూమి పూజకు వెళ్లిన బాబూమోహన్
  • ఆ స్థలాన్ని గతంలో ఓ సంఘానికి కేటాయించారంటూ నిరసన
  • బాబూమోహన్ ని ప్రశ్నించిన స్థానికులు, కాంగ్రెస్ నాయకులు
సంగారెడ్డి జిల్లాలోని అంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. అంథోల్ లో రూ.150 కోట్లతో నిర్మించనున్న ఉప విద్యుత్ కేంద్రం భూమి పూజ చేసే నిమిత్తం ఈరోజు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ స్థలాన్ని గతంలో ఓ సంఘానికి కేటాయించారని, ఇప్పుడు అదే స్థలంలో విద్యుత్ ఉపకేంద్రానికి భూమి పూజ ఎలా చేస్తారంటూ స్థానికులు, కాంగ్రెస్ నాయకులు నిలదీశారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం, ఉపవిద్యుత్ కేంద్రానికి భూమి పూజ చేసిన బాబూమోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
sangareddy
andhol
babu mohan

More Telugu News