నాని చేతుల మీదుగా 'నీవెవరో' టైటిల్ లాంచ్
- ఆది పినిశెట్టి హీరోగా 'నీవెవరో'
- కథానాయికలుగా తాప్సీ .. రితికా సింగ్
- త్వరలోనే ఇతర వివరాలు
ఈ సినిమాలో ఆయన జోడీగా తాప్సీ .. రితికా సింగ్ నటించనున్నారు. తాజాగా ఈ సినిమాకి 'నీవెవరో' టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను వదిలారు. నాని చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా నాని ఈ సినిమా టీమ్ కి 'ఆల్ ది బెస్ట్' చెప్పాడు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఇదొక థ్రిల్లర్ మూవీలా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.