వార్నర్ భార్య గర్భస్రావానికి కారణమైన బాల్ టాంపరింగ్.. కోలుకోలేకపోతున్న వార్నర్ దంపతులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వార్నర్ భార్య గర్భస్రావానికి కారణమైన బాల్ టాంపరింగ్.. కోలుకోలేకపోతున్న వార్నర్ దంపతులు

  • వార్నర్ ఇంట విషాదం నింపిన బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం
  • అభిమానుల సూటిపోటి మాటలకు తట్టుకోలేకపోయిన క్యాండీస్.. గర్భస్రావం
  • కన్నీటి పర్యంతమైన వార్నర్ దంపతులు
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో జట్టు నుంచి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆసీస్ మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తట్టుకోలేని ఆసీస్ అభిమానులు వార్నర్ భార్య క్యాండీస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసభ్య పదజాలంతో దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉన్న క్యాండీస్ అభిమానుల విమర్శలు, వ్యక్తిగత దూషణల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీనికి తోడు క్రికెట్ ఆస్ట్రేలియా పిలుపుతో సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరుకోవాల్సి రావడం.. తదితర కారణాల వల్ల క్యాండీస్‌కు గర్భస్రావమైంది. చిన్నారి వార్నర్ వస్తాడనుకుని మురిసిపోతున్న వేళ ఇలా జరగడాన్ని వార్నర్ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాండీస్ ఈ విషయాన్ని వెల్లడించింది.

కేప్‌టౌన్‌లోనే డేవిడ్ తనను ప్రేమిస్తున్నట్టు చెప్పాడని, టెస్ట్ సిరీస్ కోసం మళ్లీ అక్కడికి వచ్చినప్పుడే తాను గర్భవతినని తెలిసిందని క్యాండీస్ పేర్కొంది. చిన్నారి వార్నర్ రాబోతున్నందుకు ఇద్దరం చాలా సంతోషించామని, కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం తమ జీవితాల్లో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానుల సూటిపోటి మాటలు, ప్రయాణం కారణంగా ఆ ఒత్తిడి కడుపులోని తన బిడ్డకు పడుతుందేమోనని అనుకున్నానని, భయపడినట్టే జరిగిందని కన్నీరు పెట్టుకుంది. గర్భస్రావం తమ ఇంట విషాదాన్ని నింపిందని, తట్టుకోలేక ఇద్దరం ఏడ్చేశామని క్యాండీస్ వివరించింది.
David warner
Candice
Australia
Cricket

More Telugu News