kumaraswamy: బెంగళూరులో భారీ వర్షం.. మారిన కుమారస్వామి ప్రమాణస్వీకార వేదిక?

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఈ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం విధానసౌధ ముందు ఓ భారీ వేదికను ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, శరద్ పవార్, కేజ్రీవాల్, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి ఎందరో ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీ ఎత్తున వేదికను రూపొందించారు.

ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 13 మంది జాతీయ నేతలు హాజరవుతున్నారు. వేదికపై యాభై మంది ప్రముఖులు కూర్చునేలా తీర్చిదిద్దారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లను ఆయన తండ్రి దేవేగౌడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే బెంగళూరులో ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వేదికను విధానసౌధలోని బ్యాంకెట్ హాలుకు మార్చినట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
kumaraswamy
oath
vidhanasoudha

More Telugu News