'కాటమరాయుడు' దర్శకుడితో నితిన్

  • 'శ్రీనివాస కల్యాణం' చేస్తోన్న నితిన్ 
  • తరువాత ప్రాజెక్టు డాలీతో 
  • సరికొత్త తరహా పాత్రలో నితిన్       
తెలుగు తెరపై హాండ్సమ్ గా కనిపించే కథానాయకులలో నితిన్ ఒకరు. 'లై' .. ' ఛల్ మోహన్ రంగ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ కారణంగానే ఆయన దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లోని 'శ్రీనివాస కల్యాణం ' ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక వైపున ఈ సినిమా షూటింగు కొనసాగుతూ ఉండగానే, మరో వైపున దర్శకుడు డాలీ ( కిషోర్ కుమార్ పార్ధసాని)తో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పేసినట్టుగా సమాచారం. గతంలో డాలీ 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో 'గోపాల గోపాల' మాత్రమే జనాదరణ పొందింది. తాజాగా ఆయన నితిన్ కి వినిపించిన కథ కొత్తగా ఉంటుందనీ .. నితిన్ కి వెరైటీ పాత్రని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
nithin
kishor kumar

More Telugu News