మరింత విషమంగా మాదాల రంగారావు పరిస్థితి!
- నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న మాదాల రంగారావు
- లైఫ్ సేవింగ్ మెషీన్ సాయంతో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
- అభిమానుల ప్రార్థనలే కాపాడతాయన్న తనయుడు
ఆయన కిడ్నీలు చెడిపోయాయని, ఊపిరి తీసుకోలేకున్నారని, శరీరంలోని పలు అవయవాల పనితీరు మందగించిందని, డాక్టర్లు తాము చేయగలిగినదంతా చేస్తున్నారని, అభిమానుల ప్రార్థనలతో ఆయన కోలుకుంటారనే భావిస్తున్నానని అన్నారు. గతంలో ఆయనకు బైపాస్ జరిగిందని, అంతకుముందు ఓ సారి హార్ట్ ఎటాక్ కూడా వచ్చిందని గుర్తు చేసిన రవి, అప్పట్లోనూ తన తండ్రి ప్రాణాల కోసం పోరాడి బయటపడ్డారని వెల్లడించారు.