Chandrababu: ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం!: వైసీపీ నేత బొత్స

షార్ట్స్‌లో చూడండి
నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన చంద్రబాబు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేడు విశాఖపట్టణంలో ధర్మపోరాట దీక్ష ను చంద్రబాబు ఎందుకు చేశారో అర్థం కావట్లేదని అన్నారు.

రాజకీయ లబ్ది కోసం, ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు చేస్తున్నదే ఈ ధర్మపోరాట దీక్ష అని విమర్శించారు. బీజేపీతో వైసీపీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ సభ్యురాలి పదవిని ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారని, ధర్మం పేరిట ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Botsa Satyanarayana

More Telugu News