Tv9: టీవీ9 విజయవాడ రిపోర్టర్ అశోక్ ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన కానిస్టేబుల్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు వార్తా చానల్ టీవీ9లో విజయవాడ రిపోర్టరుగా పనిచేస్తున్న అశోక్ అనే యువకుడిని కించపరుస్తూ, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాల్లో కామెంట్లు, పోస్టులు పెట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గండేపల్లి కామరాజుపై కేసు నమోదైంది. తనను బెదిరించడంతో పాటు, దూషించడం, అసభ్య కామెంట్లు పెట్టడంపై అశోక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వన్ టౌన్ ట్రాఫిక్ విభాగంలో కామరాజు పని చేస్తున్నాడు. అశోక్ పోస్టులు, వీడియోలను వైరల్ చేసిన పాలిట్రిక్స్ వెబ్ సైట్ పై కూడా కేసు పెట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కామరాజుపై ఐపీసీ సెక్షన్ 34, 506లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదైందని, విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Tv9
Vijayawada
Facebook
Ashok

More Telugu News