'శ్రీనివాస కల్యాణం' థియేటర్లకు వచ్చేది అప్పుడేనట!
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
- నితిన్ సరసన రాశి ఖన్నా
- ఆగస్టు 9వ తేదీన విడుదల
ముందుగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఆగస్టు 9వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారనేది తాజా సమాచారం.
దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శతమానం భవతి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. ఇక 'తొలిప్రేమ' హిట్ తరువాత రాశి ఖన్నా నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.