మా పార్టీయే అతిపెద్ద పార్టీ కదా, మరి ప్రభుత్వ ఏర్పాటుకు మాకూ అవకాశం ఇవ్వండి!: గోవా కాంగ్రెస్ డిమాండ్
- గోవాలో కర్ణాటక ఫార్ములా
- గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 17 సీట్లు గెలిచాం
- బీజేపీ 13 మాత్రమే గెలిచింది
- రేపు గోవా రాజ్‌భవన్ ముందు పెరేడ్
గత ఏడాది తమ రాష్ట్రంలో 40 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించామని, అయినప్పటికీ 13 సీట్లే గెలిచిన బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత యతీశ్ నాయక్ అన్నారు. కానీ, కర్ణాటకలో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, కాబట్టి ఇప్పుడు తమ గవర్నర్ ముందు ఓ డిమాండ్ ఉంచుతున్నామని అన్నారు. గోవాలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు.