Pawan Kalyan: నాకు ముందే తెలుసు... కర్ణాటక రాజకీయ ఎత్తుగడలపై పవన్ కల్యాణ్‌ స్పందన

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నెల రోజుల క్రితమే తాను కొంత మంది అధికారులను కలిసినప్పుడు తనతో ఈ విషయంపై పలు విషయాలు పంచుకున్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి 90లోపు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అన్నారని, వారి విధానాలు వారికి ఉన్నాయని అన్నారు. అవేంటో అందరికీ తెలుసని, దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని, అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయని పవన్‌ అన్నారు. దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులని నీరు గార్చుతూ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదని, టీడీపీ, వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాయని, అన్ని పార్టీలు బేరసారాలు చేస్తూనే ఉన్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కోరుకునే వారిలో తానూ ఒకరినని అన్నారు. దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Karnataka

More Telugu News