kalyan: చిరూ చిన్నల్లుడు డబ్బింగ్ మొదలెట్టేశాడు

షార్ట్స్‌లో చూడండి
చిరూ చిన్నల్లుడు కల్యాణ్ ను చూడగానే .. చరణ్ కి దగ్గరి పోలికలు ఉన్నాయని చాలామంది అనుకున్నారు. ఇతగాడు కూడా హీరో కావడం ఖాయమని చెప్పుకున్నారు. అక్షరాలా ఇప్పుడు అదే జరిగింది. సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో కల్యాణ్ .. నటనలో శిక్షణ తీసుకున్నాడు. గట్టి కసరత్తులు చేస్తూ మరింత ఫిట్ నెస్ పెంచుకున్నాడు.సాయి కొర్రపాటి నిర్మాణంలో రాకేశ్ శశి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాడు. ఒక వైపున ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతూ ఉండగానే, మరో వైపున డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. కల్యాణ్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉండటం విశేషం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా మాళవిక నాయర్ కనిపించనుంది. చిరూ చిన్నల్లుడి సినిమాపై సహజంగానే అంచనాలు బాగానే వున్నాయి. ఆ అంచనాలను కల్యాణ్ ఎంతవరకూ అందుకుంటాడో చూడాలి మరి.   
Go Back to Shorts
kalyan
malavika

More Telugu News