Rahul Gandhi: బీజేపీ సంబరాలు చేసుకుంటుంటే, భారతావని ఓ ఖూనీ చూసి మౌనం పాటిస్తోంది: రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
ఈ ఉదయం కర్ణాటక సీఎంగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇది బీజేపీ అహేతుకమైన పట్టుదలని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని నిప్పులు చెరిగారు. కాగా, ఈ ఉదయం బెంగళూరు రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rahul Gandhi
Twitter
BJP

More Telugu News