గన్నవరం ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. దుర్భాషలాడుతూ హీరో శివాజీని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
Add ap7am to your home Screen

గన్నవరం ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. దుర్భాషలాడుతూ హీరో శివాజీని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

  • కన్నాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన బీజేపీ శ్రేణులు
  • అదే సమయంలో అక్కడ ఎదురుపడిన శివాజీ
  • శివాజీని కారు ఎక్కించి పంపిన పోలీసులు
కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూ ఢిల్లీ నుంచి విమానంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు. అయితే, అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు.

ఆయనను చూసిన బీజేపీ శ్రేణులు దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకుని, ఆయనను ముందుకు కదలనివ్వలేదు. తీవ్ర వాగ్వివాదం చెలరేగుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శివాజీని పోలీసులు కారు ఎక్కించి పంపారు.   
gannavaram
shivaji
BJP

More Telugu News