మాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు: విజయసాయిరెడ్డి

  • జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు
  • మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని భావిస్తున్నారని చెప్పారు. ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా విజయసాయి కూడా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని... రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. 
Go Back to Shorts
Jagan
Chandrababu
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News