కర్ణాటకం... సాధారణ మెజారిటీకి ఒకే ఒక్క అడుగు దూరంలో బీజేపీ!
- 111 స్థానాల్లో బీజేపీ ముందంజ
- 61 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
- ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళుతున్న బీజేపీ
తొలి దశలో హోరాహోరీగా సాగుతున్నాయని భావించిన ఎన్నికలు, ఆపై నెమ్మదిగా బీజేపీ వైపు మొగ్గు చూపాయి. మైసూరు మినహా ప్రతి జిల్లాలో బీజేపీ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ సాగుతోంది. తీర్దహళ్ళిలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేంద్ర, మంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి యుటి ఖాదర్ గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.