Karnataka: సర్వం సిద్ధం.. రేపు ఉదయం 8 గంటల నుంచి కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌

షార్ట్స్‌లో చూడండి
దేశ ప్రజల దృష్టంతా తన వైపునకు తిప్పుకున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై వుంది. మరోపక్క, ఎగ్జిట్‌ పోల్స్‌ కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ కోసం సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం మొత్తం 40 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓట్ల కౌంటింగ్‌లో 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని నియోజక వర్గాల ఓట్ల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
Go Back to Shorts
Karnataka
assembly
elections

More Telugu News