మరొక్కరోజు వేచి చూస్తే అంతా తెలిసిపోతుంది: సిద్ధరామయ్య
- ఐదేళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను
- చాలా నేర్చుకున్నాను
- తగినంత రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్నాను
- కర్ణాటక ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది
తాను కర్ణాటక ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చాననే అనుకుంటున్నానని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, ఇకపై కూడా ప్రజలు తనపై ఇదే నమ్మకాన్ని ఉంచుతారని భావిస్తున్నానని సిద్ధరామయ్య అన్నారు. అయితే, రాష్ట్రాభివృద్ధి పట్ల తాను సంతృప్తిగా లేనని, కర్ణాటక ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఆ దిశగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. మరొక్కరోజు వేచి చూస్తే అంతా తెలిసిపోతుందని అన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్న విషయం తెలిసిందే.