gold: తగ్గిన బంగారం ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గి రూ.32,285గా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.20 శాతం అధికమై, 1320.50 డాలర్లకు చేరింది. భారత్‌లో స్థానిక బంగారు వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పసిడి ధర తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.41,300గా నమోదైంది.        
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News