ట్విట్టర్లో ప్రచారం అయ్యేవాటిలో 91 శాతం తప్పుడు వార్తలేనట!
- అత్యవసరాల్లో సమాయాల్లో చాలా మంది చేస్తున్న పని ఇదే
- సందేహం వ్యక్తం చేస్తున్న వారు తక్కువ మందే
- అమెరికాలో జరిగిన అధ్యయనం
కేవలం ఐదు నుంచి తొమ్మిది శాతం మంది యూజర్లు మాత్రమే తప్పుడు వార్తా? కాదా? అని వచ్చిన వార్తను రీట్వీట్ చేసి నిర్ధారించుకుంటున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. కేవలం 1-9 శాతం లోపు వారు వార్తల కచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇక తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిలో పది శాతం మంది వరకు తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారట.