black berry phone: ఫిజికల్ కీబోర్డుతో బ్లాక్ బెర్రీ నుంచి ‘కీ2’ స్మార్ట్ ఫోన్

షార్ట్స్‌లో చూడండి
ఇతర సంస్థలకు భిన్నంగా తనదైన మార్గంలో పయనించే బ్లాక్ బెర్రీ సంస్థ ‘కీ2’ పేరుతో ఫిజికల్ కీ బోర్డు కలిగిన ఫోన్ ను ఈ ఏడాది జూన్ 7న న్యూయార్క్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించబోతోంది. కీవన్ ఫోన్ కు ఇది కొనసాగింపు వెర్షన్. ఇందులో వెనుక భాగంలో డ్యుయల్ కెెమెరాలు (12+8  మెగా పిక్సల్) ఉంటాయి.

ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఈ ట్రెండ్ చూస్తూనే ఉన్నాం. బ్లాక్ బెర్రీ కీ2 ఆండ్రాయిడ్ 8.1 ఓరియోపై పనిచేస్తుంది. 4.5 అంగుళాల డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 3,360 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
black berry phone

More Telugu News