'మహానటి'లో సావిత్రి మద్యం తాగే సీన్ పై చిరంజీవి ప్రశ్న.. దర్శకుడి జవాబు!
- 'మహానటి'తో సక్సెస్ అందుకున్న నాగ్ అశ్విన్
- చిరంజీవి చేతులమీదుగా సత్కారం
- ఆయన సందేహాలకు సమాధానాలు
"అయితే సావిత్రికి గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆమె మద్యం తాగే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పే విషయంలో ఆమె కూతురు చాముండేశ్వరి గారు అభ్యంతరం చెప్పలేదా"? అని అడిగారు. అందుకు నాగ్ అశ్విన్ స్పందిస్తూ .. " ఆ విషయంలో చాముండేశ్వరి గారు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. నిజంగానే అలా జరిగింది కనుక .. చెప్పమని అన్నారు. అయితే ఆ విషయాన్ని హైలైట్ చేయకుండా .. ఆమె బయోపిక్ ఓ సెలబ్రేషన్ లా మిగిలిపోవాలనే ఉద్దేశంతోనే తీశాను" అంటూ ఆయన సమాధానమిచ్చారు.