కర్ణాటకలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు ఉచితంగా దోశ!
- నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్ వినూత్న ఆలోచన
- తొలిసారి ఓటు వేసే యువతకు దోశ
- ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఫిల్టర్ కాఫీ
ఈ విషయం తెలిసిన మీడియా ఆయన్ని పలకరించగా.. ఓటు వేసిన ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్ సిబ్బందికి చూపిస్తే.. దోశ, ఫిల్టర్ కాఫీ ఇస్తారని చెప్పారు. అసలు, ఈ ఆలోచన రావడానికి కారణం గురించి ఆయన ప్రస్తావించారు. బెంగళూరులో నమోదవుతున్న తక్కువ ఓటింగ్ శాతాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేశారనే దాని కన్నా, ఓటు హక్కు వినియోగించుకున్నారా? లేదా? అనేది ముఖ్యమని అన్నారు.