Karnataka: బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు.. మమ్మల్నేం చేయలేరు!: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక ఎన్నికల తరువాత టీడీపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాను ఏపీ ప్రజల తరఫున న్యాయం కోసం ప్రధానమంత్రిపై ముఖ్యమంత్రిగా పోరాడుతున్నానని అన్నారు.

 వైసీపీ మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ తీరును ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, రాష్ట్రాన్ని నాలుగేళ్ల పాటు మన కష్టంతో అభివృద్ధి చేసుకున్నామని, ఇందులో కేంద్ర సహకారం లేదని ప్రజలే అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.          
Go Back to Shorts
Karnataka
Chandrababu
Andhra Pradesh
BJP

More Telugu News