చివరకు గెలిచేది ప్రజాబలమే!: మోదీపై మండిపడ్డ బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా
- ప్రసంగాలు హుందాగా, మర్యాదకరంగా ఉండాలి
- పరిధి దాటి వ్యక్తిగత దాడులు చేయడం దారుణం
- ధన బలం గెలవదు.. చివరకు ప్రజా బలమే గెలుస్తుంది
ప్రసంగాలు హుందాగా, మర్యాదకరంగా ఉండాలని మోదీకి సూచించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వరుస ట్వీట్లు చేస్తూ... ఎన్నికల్లో ధనబలం గెలవదని, చివరకు ప్రజా బలమే గెలుస్తుందని చెప్పారు. బీహార్ నుంచి కర్ణాటకు వరకు తనను స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ ఆహ్వానించలేదని... అయినా పార్టీ సానుభూతిపరుడిగా తాను ఈ సూచనలు చేస్తున్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో మోదీ విధానాలను శత్రుఘ్నసిన్హా పలుమార్లు బహిరంగంగానే తప్పుబట్టిన సంగతి తెలిసిందే.