Narendra Modi: 'అభివృద్ధి పనులకు కారణం మోదీనే' అని పేర్కొని.. నాలుక్కరుచుకున్న సిద్ధరామయ్య

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును పదే పదే పలుకుతోన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తాజాగా ఓ ర్యాలీలో పాల్గొని గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సౌకర్యం వంటి అభివృద్ధి పనులకు కారణం నరేంద్ర మోదీనే అని పేర్కొని నాలుక్కరుచుకున్నారు. వేదికపై ఉన్న నరేంద్ర స్వామి పేరుకి బదులు సిద్ధరామయ్య నోటి వెంట నరేంద్ర మోదీ పేరు వచ్చింది.

చివరకు మళ్లీ తన వ్యాఖ్యను సరి చేసుకుంటూ నరేంద్ర అనేది చాలా ముఖ్యమైన పదమని, స్వామి ఇక్కడ ఉన్నారని, మోదీ గుజరాత్‌లో ఉంటారని అన్నారు. నరేంద్ర మోదీ కల్పితమని, నరేంద్ర స్వామి సత్యమని వ్యాఖ్యానించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ సిద్ధరామయ్య మెదడులో మోదీ పేరు బలంగా నాటుకు పోయిందని సెటైర్లు వేస్తున్నారు. 
Go Back to Shorts
Narendra Modi
sidda ramaiah
Karnataka

More Telugu News