vote for note: ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ ఎలా సమీక్ష నిర్వహిస్తారు?: సోమిరెడ్డి మండిపాటు

  • ఓటుకు నోటు అక్రమ కేసు అని హైకోర్టు ఇంతకు ముందే చెప్పింది
  • హైకోర్టులో విచారణలో ఉన్న కేసును ఎలా సమీక్షిస్తారన్న సోమిరెడ్డి
  • కేసులను సమీక్షించే అధికారం సీఎంకు ఉంటుందన్న కర్నె

ఓటుకు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తుండటంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు ఒక అక్రమ కేసు అంటూ మత్తయ్య పిటిషన్ వేసిన సమయంలోనే హైకోర్టు కామెంట్ చేసిందని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు విచారిస్తున్న కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా సమీక్ష నిర్వహిస్తారని ప్రశ్నించారు.

మరోవైపు, ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసుతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. ఎన్నికలకు, కేసులకు సంబంధం లేదని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి కాసేపట్లో మత్తయ్య మీడియా ముందుకు రానున్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

More Telugu News