Andhra Pradesh: విభజన కష్టాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం: మంత్రి యనమల
విభజన కష్టాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తూ బయటకు వస్తున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ప్రజాదర్బార్ హాలులో ఈరోజు ప్రారంభమైంది.
ఈ సమావేశంలో పాల్గొన్న యనమల మాట్లాడుతూ, సమర్థ నాయకత్వం, దిశానిర్దేశంతో సక్రమమైన ఫలాలు అందుకుంటున్నామని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడంతో అనుకున్నట్టుగా ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ ఏడాది కూడా కష్టపడి పని చేస్తే మరింత వృద్ధి సాధిస్తామని, నిధుల విడుదలలో ఎక్కడా జాప్యం లేకుండా చూస్తున్నామని అన్నారు.