గత మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్
- వెంకటాపురంలో రవి, సునీతల కుమార్తె వివాహం
- పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షించిన చమన్
- ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో ఉన్న చమన్
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఎనిమిదేళ్ల పాటు చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2012లో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, పరిటాల సునీత మంత్రి కావడం జరిగాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి ఆయన జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత ఒక ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు అనంతపురం జడ్పీటీసీగా పని చేశారు.