మీ శరీరానికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే వస్త్రాలు అందించేందుకు అమేజాన్ సరికొత్త ప్రయోగం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ శరీరానికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే వస్త్రాలు అందించేందుకు అమేజాన్ సరికొత్త ప్రయోగం

  • కస్టమర్ల బాడీకి 3డీ స్కాన్
  • వాటి శరీర ఆకృతి, పరిమాణం కొలతలు, మార్పులపై పరిశీలన
  • చక్కగా ఫిట్ అయ్యే వస్త్రాలు అందించే ప్రయత్నం
ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ కస్టమర్ల కోణంలో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్లకు మరింత కచ్చితత్వంతో కూడిన సైజుతో వస్త్రాలు అందించేందుకు 3డీ స్కాన్ పరిశోధన చేపట్టింది. న్యూయార్క్ లోని తన కార్యాలయానికి రావాలంటూ కొందరు కస్టమర్లను కోరింది.

వీరు స్వచ్చందంగా 20 వారాల పాటు ప్రతీ నెలా రెండు సార్లు అమేజాన్ కార్యాలయానికి వెళితే వారి మొత్తం శరీరాన్ని 3డీ స్కాన్ చేసి, ఆకృతి, సైజులో వచ్చే మార్పులను గమనించడం జరుగుతుంది. బాడీ ఆకృ‌తికి చక్కగా ఫిట్ అయ్యే సైజు వస్త్రాలను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కామర్స్ సంస్థలు కస్టమర్ల అభిరుచులు కనుక్కుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం అనేది గతంలోనూ ఉంది. 
amazon
shopping

More Telugu News