Andhra Pradesh: ఏపీలో రేపు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం!
ఏపీ సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం రేపు జరగనుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై ఆర్థిక మంత్రులు చర్చించనున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, సిక్కిం, మేఘాలయ, మిజోరాం తదితర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. అయితే, కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న కారణంగా ఈ సమావేశానికి ఆ రాష్ట్ర మంత్రి హాజరుకావట్లేదని తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై యనమల రామకృష్ణుడు ఇప్పటికే సమీక్షించారు.