మారని మందుబాబులు... హైదరాబాద్ లో పట్టుబడ్డ 60 మంది

  • 31 బైక్ లు, 29 కార్లు సీజ్
  • సోమవారం నాడు కౌన్సెలింగ్
  • ఆపై కోర్టులో హాజరు పరుస్తామన్న పోలీసులు
మద్యం తాగి వాహనాలు నడపవద్దని, పట్టుబడితే కఠిన శిక్షలుంటాయని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మందుబాబులు మారడం లేదు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, 60 మంది పట్టుబడ్డారు. 31 బైక్ లు, 29 కార్లను పోలీసులు సీజ్ చేశారు. వీరందరికీ సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఆపై కోర్టుకు హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిలో రెండు, మూడోసారి పట్టుబడిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం.
Go Back to Shorts
Hyderabad
Police
Drunk Driving

More Telugu News