దేవెగౌడను పొగిడిన నోటితోనే... ఓటు వేయవద్దని కోరిన మోదీ
- మూడు రోజుల క్రితం దేవెగౌడపై పొగడ్తల వర్షం కురిపించిన మోదీ
- తాజాగా జేడీఎస్ కు ఓటు వేయవద్దని కోరిన ప్రధాని
- జేడీఎస్ కు ఓటు వేయడం మంచి నిర్ణయం కాదన్న మోదీ
మరోవైపు, దేవెగౌడపై మోదీ ప్రశంసలు కురిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. దేవెగౌడ కూడా దాన్ని నమ్మలేకపోయారు. అయినా జేడీఎస్, బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ లతో పాటు మరికొందరు మిత్రుల సహకారంతో కర్ణాటకలో తాము కచ్చితంగా అధికారాన్ని చేపడతామని దేవెగౌడ అన్నారు.