మాది మధ్యతరగతి కుటుంబం .. హీరోయిన్ అయిపోదామని వచ్చాను: నటి జ్యోతి
- డాన్స్ .. నటన అంటే ఇష్టం
- సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను
- ఎస్వీ కృష్ణారెడ్డిగారు మంచి ఛాన్స్ ఇచ్చారు
వైజాగ్ లో ఫొటో షూట్ చేసుకుని .. హీరోయిన్ అయిపోదామనే ఉద్దేశంతో హైదరాబాద్ లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. చివరికి ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిథిగా ఎస్వీ కృష్ణారెడ్డిగారు వచ్చారు. ఆయన సినిమాలో చేయాలని ఉందని చెప్పాను. తన సినిమాలో ఒక రోల్ వుంది చేయమన్నారు. హీరోయిన్ గా అయితేనే చేస్తానని చెబితే .. వేరే రోల్ కి ఒప్పించారు. ఆ తరువాత 'హంగామా' సినిమాలో హీరోయిన్ గాను ఛాన్స్ ఇచ్చారు" అంటూ చెప్పుకొచ్చింది.