Aliens: మార్స్ పై మహిళా యోధురాలి ఆకారం... నాసా పోస్టు చేసిన చిత్రమిదే!

షార్ట్స్‌లో చూడండి
ఏలియన్స్ గురించి ఇటీవలి కాలంలో మరింత ఆసక్తి పెరిగి పెద్దఎత్తున చర్చలు సాగుతున్న వేళ, యూఎస్ అంతరిక్ష సంస్థ నానా పోస్టు చేసిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. మార్స్ రోవర్ తీసిన ఈ అంగారకుడి ఉపరితల చిత్రంలో ఓ మహిళా యోధురాలి తల ఆకారం కనిపిస్తుండటమే ఇందుకు కారణం. ఇది ఓ రాయి అని తెలుస్తుండగా, దాన్ని ఎవరో గ్రహాంతరవాసులు చెక్కుంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఏలియన్స్ ఇప్పటికే పలుమార్లు భూమిపైకి వచ్చి వెళ్లాయని నమ్మేవారు ఎందరో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈజిప్టు పిరమిడ్లపై ఎన్నో ఏలియన్స్ బొమ్మలు ఉన్నాయి కూడా. నాసా పోస్టు చేసిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Aliens
NASA
Mars

More Telugu News