వ్యసనాలకు అలవాటై దొంగగా మారిన టీవీ నటుడికి అరదండాలు
- చోరీల్లో దిట్టగా మారిన నాగరాజు
- చైతన్యపురి, సరూర్ నగర్ పరిధిలో 16 దొంగతనాలు
- నిందితుడి నుంచి రూ.14.52 లక్షల విలువైన నగలు స్వాధీనం
సినీ రంగంపై ఉన్న మోజుతో ప్రముఖ స్టూడియోలో కొంతకాలం ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాడు. ఈ క్రమంలో ఓ హాస్య నాటికలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక ఇబ్బంది పడ్డాడు. దీంతో దొంగగా మారాడు. దొంగిలించిన నగలను గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు.
హుజూర్ నగర్‌లో నాలుగు బైకులు చోరీ చేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 చోరీలు చేశాడు. ఈ క్రమంలో చైతన్యపురి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారు ఆభరణాలు, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం.భగవత్ తెలిపారు.