ఇన్ఫినిటీ డిస్ ప్లే బరిలోకి శామ్ సంగ్... బడ్జెట్ రేంజ్ లో ఏ6, 6 ప్లస్ ఫోన్లు
- 18.5:9 యాస్పెక్ట్ రేషియోతో డిస్ ప్లే
- ఎ6లో ఎక్సినోస్ ప్రాసెస్, 6ప్లస్ లో క్వాల్ కామ్ ప్రాసెసర్
- ఎ6లో 5.6 అంగుళాల స్క్రీన్, 6ప్లస్ లో 6 అంగుళాల స్క్రీన్
కాకపోతే పలు సోర్స్ ల ద్వారా కొందరు స్పెసిఫికేషన్లపై వివరాలు లీక్ చేస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే గెలాక్సీ ఎ6 5.6 అంగుళాల హెచ్ డీ+ అమోలెడ్ డిస్ ప్లే, వెనుక 16 మెగా పిక్సల్ కెమెరా, 1.7 ఎఫ్ అపెర్చర్, ముందు కూడా 16 మెగాపిక్సల్ కెమెరా, 1.9 అపెర్చర్, రెండు వైపులా ఫ్లాష్ లైట్ ఉంటాయని సమాచారం. అలాగే, ఎ6 ప్లస్ లో 6 అంగుళాల స్క్రీన్ కూడా ఉంటాయి. వెనుక రెండు కెమెరాల సెటప్ కూడా ఉంటుందని సమాచారం.