అత్యున్నత అవార్డుకు రాహుల్ ద్రావిడ్ ను సిఫార్సు చేయడంపై వివాదం!
- ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డుకు ద్రావిడ్ ను నామినేట్ చేసిన బీసీసీఐ
- రాహుల్ ను ప్రతిపాదించడాన్ని తప్పు పడుతున్న బీసీసీఐలోని ఓ వర్గం
- అవార్డును అందుకునేంత అనుభవం రాహుల్ కు ఇంకా రాలేదని వాదన
భారత క్రికెట్ కోసం రాహుల్ ద్రావిడ్ చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పడంలో వాస్తవం ఉందని... అయితే, కోచ్ గా అతని అనుభవం కేవలం మూడేళ్లు మాత్రమే అని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డును అందుకునే అర్హత ద్రావిడ్ కు ఇంకా రాలేదని బీసీసీఐకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు.