డ్రంకెన్ డ్రైవ్ లో ఏకంగా 53 కార్లు సీజ్
- డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు
- 114 మందిపై కేసు నమోదు.. 60 బైకులు సీజ్
- మందుతాగి పట్టుబడ్డ పలువురు మహిళలు
తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 114 మందిపై కేసు నమోదు చేశారు. 53 కార్లు, 60 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన కార్లలో వెళుతున్న మహిళలు కూడా ఈ సందర్భంగా పట్టుబడ్డారు.